History of Chennakesava Swamy Temple, Markapuram

Chennakesava-Swamy-Temple-in-Markapuram-in-Prakasamకృతయుగంలో ఏనుగులు సంచరించిన అరణ్యంగా త్రేతా యుగంలో మహర్షులు తపస్సు చేసిన పవిత్ర ప్రాంతంగా, ద్వాపర యుగంలో దీవి నుండి భువికి దేవతలు దిగి వచ్చి స్వామిని ఆరాధించుకున్న దివ్య ప్రదేశంగా, కలియుగంలో మారికా, మారకులనెడి యాదవ దంపతులను తరింపజేసిన పుణ్యక్షేత్రంగా ఈ దేవస్థానాంనకు పేరుంది. అందువల్లనే మారకాపురం అనేది మార్కాపురం అయ్యిండంటారు.

Sunraysఇక్కడ శ్రీ స్వామి వారి ఎడమ చేతి యందు శేష చక్రం ఉండటం విశేషం . మార్కండేయ మహర్షి తపస్సును కేసి అనే రాక్షసుడు భంగాపరచే ప్రయత్నం చేయగా శ్రీ మహా విష్ణువు తనకు పాంపుగా ఉన్న ఆది శేషున్ణి చక్ర రూపంగా రాక్షసుని పై ప్రయోగించడని పురాణ గాధ ఉన్నది. ఇక్కడి అమ్మవారు శ్రీ రాజ్య లక్ష్మి. ఈ ఆలయ నిర్మాణం 15 వ శతాబ్ధంలో విజయనగర చక్రవర్తులు చేసినట్లు, శాసన సాక్ష్యం ఉంది. సూర్యుని కాంతి తరంగ పరంపర ఇక్కడి గర్భ గుదిలోని మూల విరాట్టు పై ప్రసారం కావడం ఆనాటి శాస్త్రజ్ఞుల ప్రతిభ.

మార్కాపురాన్ని పూర్వం మారీకాపురమని వ్యవహరించేవారు. శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి రాజ్య లక్ష్మి సమేతుడై కొలువైన స్థలమిది. ఈ ఆలయంలో శిల్పుల ప్రతిభా పాటవాలు అడుగడుగునా మనకు గోచారమవుతాయి. ఆలయానికి ముందున్న మన్యరంగా మండపమును శ్రీ కృష్ణ దేవరాయలు నిర్మించినట్లు ప్రతీతి. ఇరువురు అన్నదమ్ములైనా శిల్పులు తమ మధ్య ఒక వస్త్రాన్ని అడ్డు పెట్టుకొని కేవలం శబ్ధాగ్రహణ నైపుణ్యంతో ఇద్దరు ఒకే విధమైన శిల్పాలను చెక్కారని ప్రతీతి. నేటికి ఈ రెండు శిల్పాలున్న స్థంభాలను అన్నదమ్ముల స్తంభాలని వ్యవహరిస్తుంటారు (పిలుస్తుంటారు).

ఈ ఆలయం విజయనగర రాజుల కాలంలో అత్యంత వైభవాన్ని అనుభవించిందనటానికి ఆలయం లోని 18 శాసనాలు సాక్ష్యంగా ఉన్నాయి. 18 వ శతాబ్ధంలో బ్రహ్మనాయుడు ప్రాకారాలను నిర్మించినట్లు, ఆలయ పునరుద్ధరణ జరిపినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. ఈ ఆలయ 11 అంతస్థుల గాలి గోపురం కొన్ని మైళ్ళ దూరం వరకు కనిపిస్తుంటుంది. దక్షిణాత్య శిల్ప కళా చాతుర్యాన్ని చాటేలా ఆలయంలో నిర్మితమైన ' చూంచు' ను చూసిన వారు ఆ శిల్పకళ ను కొనియాడి తీరవలసినదే. ప్రతి సంవత్సరము చైత్రమాసంలో స్వామివారికి ద్వాదశాహ్నిక దీక్షతో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.

Stalapuranamస్థల పురాణం | మారికా, మారకులనే యాదవ దంపతులు స్వామిని సేవించి ఆయనలో లీనమైనందున వారిరువురి పేర్ల మీదుగా మారీకాపురమనే పేరు వచ్చిందట. స్వామి వారి మకర టోరణంలో శ్రీదేవి భూదేవులు ఉండ వలసిన స్థానంలో మార్కండేయ, మారికా, మారకుల రూపులు ఉండటం కూడా స్వామి వారితో ఆ దంపతుల అనుబంధాన్ని సూచిస్తుంది. మార్కండేయ మహర్షి కుండలినీ నది తీరమున తపస్సు చేస్తుండగా ఆయన తపస్సును భగ్నపరుస్తున్న కేసి అనే రాక్షసుణ్ణీ స్వామి వారు తన పానుపైన ఆది శేషుని చక్రంగా ప్రయోగించి సంహరించాడని, అందువల్లనే మార్కండేయ మహర్షి అక్కడ ప్రతిక్షితీంచిన శ్రీ లక్ష్మి చెన్నా కేశవ స్వామి విగ్రహం చక్రధారియై ఉన్నట్లు సృష్టించాడని అంటారు.

ఈ దేవస్థానంలో ప్రతి రోజు ఉదయం శ్రీ స్వామి వారికి, అమ్మవారికి పంచమృుతం తో అభిషేకం, సహస్త్రనామార్చనలు, సాయంత్రం విష్ణు సహస్త్రనామ పారాయణ, భజనలు జరుగుతుంటాయి. ప్రతి శుక్రవారం సాయంత్రం శ్రీ రాజ్య లక్ష్మి అమ్మవారికి ఆలయ ఉత్సవం, ప్రతి శనివారం ఉదయం స్వామి వారికి కళ్యాణం జరుగుతుంది. ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాలలో పొన్నమాను, గరుడ, గజ వాహనముల పై రధోథ్సవాలు విశేషంగా జరుగును. ప్రతి ఏటా ఉగాది, శ్రీ రామ నవమి, శ్రీ నృసింహ జయంతి, తొలి ఏకాదశి, శ్రీ కృష్ణాష్టమి, ఉట్ల పండుగ, వినాయక చవితి, దేవి నవరాత్రులు, తెప్పొత్సవము తదితర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.

Posted by :Admin

Related Posts

  • Sri Brahmaramba Mallikarjuna Swamy Devasthanam, Srisailam, Kurnool, Andhra Pradesh Sri Brahmaramba Mallikarjuna Swamy Devasthanam, Srisailam, Kurnool, Andhra Pradesh

    Srisailam was famous in the 4th century A.D, according to Nasik inscription in this inscription mountain was divided into 3 parts. One of them was sirithan. Later it was called as Nallamala. Nasik inscription was carved by pulomavi belongs to satavahana dynasty. He ruled Deccan from 102 to 130 A.D. thus; about Srisailam primarily we can see in this inscription only

Latest Posts

  • Temples
  • Sacred Places
  • Articles
  • Pancha Sabhai Sthalams / Sthalangal
    Pancha Sabhai Sthalangal refers to the temples of Lord Nataraja, a form of Lord Shiva where he performed the Cosmic Dance. Panc..
  • Pancha Bhoota Stalas
    Pancha Bhoota Stalam or Pancha Bhoota Stala refers to the five Shiva temples, dedicated to Shiva, the most powerful Hindu god a..
  • 18 Shakti Peethas / Asta Dasa Shakti Peethas
    Astadasha Shakthi Peetas Lord Brahma performed a yagna to please Shakti and Shiva. Goddess Shakti emerged, separating from Shiv..
  • Navagaraha Sthala or Temple
    Navagraha Suriyan (Sun), Chandran (Moon), Chevvai (Mars), Budha (Mercury), Guru (jupiter), Sukra (Venus), Sani (Saturn), Rahu (..

Gallery

  • Siddeshwara Swamy Temple, Warangal
  • 10 Unique things you should do in Kolhapur
  • Sri Seetha Ramachandra Swamy Vaari Devasthanams, Bhadrachalam, Khammam, Telangana
  • Sri Brahmaramba Mallikarjuna Swamy Devasthanam, Srisailam, Kurnool, Andhra Pradesh
  • Maisigandi Maisamma Temple Kadthal,  Mahabubnagar, Telangana
  • Arulmigu Jambukeswarar Akhilandeswari Temple, Thiruvanaikaval, Trichy, Tamilnadu
  • Sri Lakshmi Tirupatamma Devasthanam, Penuganchiprolu, Andhra Pradesh
  • Sri Subrahmanyeswara Swamy Vari Devasthanam, Mopidevi, Andhra Pradesh
  • Sri Durga Malleswara Swamy Varla Devastanams, Vijayawada
  • Sree Bhadrakali Devasthanam, Warangal
  • Sri Lakshmi Ganapathy Temple, Biccavolu
  • Ashok Vatika
  • The Lords Own Country, Dwarka
  • Simhachalam Temple
  • Sree Padmanabhaswamy Temple